Healthhealth tips in telugu

మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఈ మొక్క ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

Thummi Mokka : మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నా మనకు తెలియక పిచ్చి మొక్కలు అని భావిస్తాం. అటువంటి మొక్కలలో తుమ్మి మొక్క ఒకటి. ఈ .తుమ్మి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. తుమ్మి మొక్క ఇంట్లో ఉంటే ఎటువంటి వ్యాధులు రావని చెబుతూ ఉంటారు.
thummi mokka
తుమ్మి ఆకులతో కూర చేసుకుంటారు. వర్షాకాలంలో ఎక్కువగా ఈ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం పక్షవాతంను సైతం నయం చేసే శక్తి ఉందని చెబుతారు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఈ ఆకుల రసాన్ని ఒక స్పూన్ తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

తుమ్మి ఆకులు, పువ్వులు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి తాగితే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. తుమ్మి పూల రసం, తేనె సమాన భాగాలుగా కలిపి తీసుకుంటే నీరసం, అలసట తగ్గుతుంది. కాలేయ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. తుమ్మి ఆకుల రసానికి కొంచెం ఉప్పు కలిపి చర్మ సమస్యలు ఉన్నా ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుతాయి.

సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్న వారు తుమ్మి ఆకు రసాన్ని రోజు ఉదయం, సాయంత్రం చర్మానికి రాసుకుని అరగంట తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.