ఎన్టీఆర్ హీరోయిన్ గుర్తు ఉందా… ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా… ?
Telugu actress Keerthi Chawla :సినీ పరిశ్రమలో హీరోయిన్ స్టార్ హీరోతో ఎంట్రీ ఇచ్చినా కెరీర్ పరంగా నిలదొక్కుకోలేక పోతూ ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అది సినిమాలో జోడి కట్టిన కీర్తి చావ్లా ఒకరు. ఆమె అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆది సినిమా హిట్ అయినా ఆమె తర్వాత సినిమాల కోసం కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో హీరోయిన్ రాణించలేకపోయింది.
అంతేకాకుండా ఆమె నటించిన సినిమాలు ప్లాప్ కావటంతో హీరోయిన్ గా స్టార్ హోదా పొందలేకపోయింది అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తోంది. తెలుగులో చివరగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ దర్శకత్వం వహించిన “బ్రోకర్” అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం కీర్తి చావ్లా ముంబైలో తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ అమ్మడు ప్రస్తుతం వ్యాపారాలపై దృష్టి సారించినట్లు సమాచారం.
https://www.chaipakodi.com/