10 రూపాయిల ఖర్చుతో 10 నిమిషాల్లో ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది
Lemon Face Glow Tips In telugu : మనలో చాలా మంది ముఖం మీద మచ్చలు, మొటిమలు లేకుండా కాంతివంతంగా తెల్లగా మెరిసే ముఖం కావాలని కోరుకుంటారు. దీని కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయినా రెడీగా ఉంటారు. అలాగే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
అలా కాకుండా కాస్త సమయాన్ని కేటాయించి కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. ఒక బౌల్లో రెండు స్పూన్ల టమాటా రసం, ఒక స్పూన్ బంగాళదుంప రసం, ఒక స్పూన్ కొబ్బరి నూనె,పావు స్పూన్ పసుపు, ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలపాలి
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలయ్యాక ముఖాన్ని శుభ్రంగా చల్లని నీటితో కడగాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే ముఖం మీద మచ్చలు, మొటిమలు, టాన్, మలినాలు అన్ని తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
టమోటా,నిమ్మరసం, బంగాళాదుంపలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు ముఖం మీద మురికిణి,మృత కణాలను తొలగించి ముఖం తెల్లగా మెరవటానికి సహాయపడతాయి. పసుపులో ఉన్న యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు మొటిమలను తగ్గించటానికి మరియు ముఖం మీద ఉన్న అదనపు నూనెను తొలగించటానికి సహాయపడతాయి.
కాఫీ పొడి కూడా చర్మ సంరక్షణలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో face Creams లో కాఫీ పొడిని కూడా వాడుతున్నారు. కాఫీ పొడిలో ఇండే యాంటీ ఆక్సిడెంట్స్,కెఫీన్ అనేవి వృదాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేయటమే కాకుండా ముడతలను తగ్గించటానికి కూడా సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/