Beauty Tips

10 నిమిషాల్లో మీ ముఖాన్ని తెల్లగా చేసే 100 % నేచురల్ Skin Whitening ప్యాక్

Skin Whitening Pack : ముఖం మీద నల్లని మచ్చలు,ఓపెన్ పోర్స్, నల్లని వలయాలు,మొటిమలు ఇలా ఉండటం వలన ముఖం నిర్జీవంగా ,కాంతివిహీనంగా కనపడుతుంది. వీటిని తొలగించి ముఖం కాంతివంతంగా తెల్లగా మెరవాలంటే మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలను ఉపయోగిస్తే సరిపోతుంది. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక బౌల్ బాగా పండిన అరటిపండులో సగం వేసి మెత్తగా చేయాలి. అరటిపండు పేస్ట్ లో ఒక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మూడు గంటల వరకు ముఖాన్ని సబ్బుతో కడగకూడదు.
besan
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే నల్లని మచ్చలు, ఓపెన్ పోర్స్ వంటి సమస్యలు క్రమంగా తగ్గి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని ఈ విధంగా మెరిసేలా చేసుకోవచ్చు. శనగపిండిని పూర్వ కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు. చర్మం మీద మృతకణాలను తొలగిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/