లివర్ లో కొవ్వును, వ్యర్ధాలను బయటకు పంపి లివర్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది
Liver Cleaning Tips In Telugu : మన శరీరంలో కాలేయం అనేది జీవక్రియల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాలేయం .ఉదర భాగంలో కుడి వైపున ఉంటుంది. మూడువంతుల వరకు పాడైపోయినా తిరిగి దానంతట అదే బాగుపడగలదు. పావువంతు అవయవం బావున్నా సరే తనని తాను తిరిగి నిర్మించుకోగలదు. అటువంటి అద్భుతమైన అవయవమే కాలేయం.
కాలేయం మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరంలోని కొవ్వు, చక్కెర, ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వటం, రక్తాన్ని శుద్ధి చేయడం, శరీరంలో విషాలను తొలగించటం వంటి ఎన్నో పనులు చేస్తుంది. అలాంటి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవాలి. .
లివర్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు మందులను వాడడంతోపాటు పలు రకాల ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోతాయి.
వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు లివర్ ఎంజైములు యాక్టివేట్ చేసి శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయేలా చేస్తుంది. అలాగే వెల్లుల్లిలో ఉండే సెలీనియం కూడా .వ్యర్ధాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మంచిది.పచ్చిగా తిన లేకపోతే తేనెలో కలిపి తినవచ్చు.
తృణధాన్యాలలో విటమిన్ బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉంటుంది. కాలేయం పనితీరు సామర్థ్యాన్ని పెంచేందుకు బాగా సహాయపడుతాయి. ఈ చలి కాలంలో ఆకుకూరలు విరివిగా లభిస్తున్నాయి. పాలకూరను తింటే వాటిలో ఉండే సమ్మేళనాలు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ప్రతి రోజూ గ్రీన్ టీ తాగితే లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు గ్రీన్ టీలో ఉండే కాటెకిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ లివర్ పనితీరును మెరుగుపరిచి లివర్ లోని కొవ్వును కరిగించి లివర్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది
పసుపు కూడా లివర్ ఆరోగ్యంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. .లివర్ లోని కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. బైల్ ఉత్పత్తి పెరుగుతుంది. .గాల్ బ్లాడర్ సరిగ్గా పనిచేస్తుంది. పసుపును ప్రతిరోజు పాలు లేదా వేడి నీటిలో కలిపి తీసుకోవచ్చు. వాల్ నట్స్ లో ఉండే ఆర్గైనైన్ అనే అమైనో ఆమ్లం,గ్లూటా థియోన్, ఒమెగా 3 ప్యాటి యాసిడ్లు లివర్ లోని వ్యర్ధాలను బయటకు పంపి లివర్ శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.
https://www.chaipakodi.com/