Healthhealth tips in telugu

పరగడుపున 1 స్పూన్ తింటే డయాబెటిస్,ట్రైగ్లిజరైడ్స్ లేకుండా రక్తనాళాలు క్లియర్ గా ఉంటాయి

Natural remedy for high blood sugar and cholesterol : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి, సరైన వ్యాయామం లేకపోవటం వంటి కారణాలతో డయాబెటిస్,కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె సమస్యలకు కారణం అవుతున్నాయి. డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా తొందరగా పెరుగుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.
Diabetes In Telugu
డయాబెటిస్ ఉన్నప్పుడు మందులు వాడుతూ ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు చెప్పే రెమిడీ డయాబెటిస్,కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ నియంత్రణలో ఉంటుంది. ఈ రెమిడీ కోసం రెండు నిమ్మకాయలను తీసుకొని రసం తీయాలి.

ఆ తర్వాత నిమ్మ తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నిమ్మతొక్కలో పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం, ఫ్లేవనాయడ్, హెస్పెరెటిన్ సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేయటమే కాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది. ఆ తర్వాత celery root తీసుకొని పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
celery root
దీనిలో విటమిన్ ఎ, సి, కె మరియు ఇ,డైటరీ ఫైబర్,కాల్షియం, ఇనుము, భాస్వరం, రాగి మరియు మాంగనీస్‌ సమృద్దిగా ఉండుట వలన డయాబెటిస్,అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వారికి చాలా సహాయపడుతుంది. ఆ తర్వాత 4 బిర్యానీ ఆకులను తీసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి కట్ చేసి పెట్టుకున్న నిమ్మ తొక్కలు,celery root ముక్కలు, బిర్యానీ ఆకులు వేసి బాగా ఉడికించాలి.

బాగా ఉడికిన ఈ మిశ్రమంలోని బిర్యానీ ఆకులను తీసేసి మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా చేసి సీసాలో నిల్వ చేసుకొని ఫ్రిజ్ లో పెడితే రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు పరగడుపున ఒక స్పూన్ తింటే డయాబెటిస్,చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అన్నీ నియంత్రణలోకి వస్తాయి. దాంతో గుండెకు సంబందించిన సమస్యలు ఏమి కూడా ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/