MoviesTollywood news in telugu

మెగాస్టార్ అద్భుత నటనను ఆవిష్కరించిన మూవీస్…మీరు చూసారా…?

Chiranjeevi Best Movies:స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి లో మంచి నటుడు ఉన్నాడు. అతడు నటించిన సినిమాల్లో కొన్నింటిని చూస్తే ,.. అద్భుత నటన ఎలా ఆవిష్కరించాడో అర్ధం అవుతుంది. స్టార్ హీరోగా రాకముందే పున్నమినాగు మూవీ సూపర్ హిట్ అయింది. 1980లో వచ్చిన ఈ మూవీ అతడిలోని నటుణ్ని ఆవిష్కరించింది. ప్రతి పౌర్ణమికి నాగుపాము లక్షణాలతో మారిపోయే మనిషిగా నాగులు పాత్రలో ఇతడి నటనకు మొదటి సారిగా ఫిలిం ఫేర్ అవార్డు కి నామినేట్ అయ్యేలా చేసింది.
chiranjeevi movies
తర్వాత చెప్పాలంటే కె విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన శుభలేఖ మూవీ చిరంజీవి కెరీర్ లో ఓ ప్రత్యేకత సంతరించుకుంది.1982లో వచ్చిన ఈ మూవీ మొదటిసారి ఫిలిం ఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక 1983లో వచ్చిన అభిలాష మూవీ లో ఉరి శిక్షను రద్దు చేయించడానికి తపించే ఓ లాయర్ క్యారెక్టర్ లో చిరు నటన అద్భుతం. ఇక అదే ఏడాది వచ్చిన ఖైదీ మూవీ చిరుని ఏకంగా స్టార్ హీరోగా నిలబెట్టింది. సెన్షేషనల్ హిట్ కొట్టింది.

పగతో రగిలిపోయే సూర్యం పాత్రలో చిరు నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. 1985లో విడుదలైన విజేత మూవీ సూపర్ హిట్ అయింది. ఓ మధ్య తరగతి యువకుడు తన కుటుంబ సమస్యల పరిష్కారానికి తన ప్రాణాలను ఫణంగా పెట్టి కిడ్నీ దానం చేసే పాత్రలో చిరు నటన అద్భుతం. 1986లో జంధ్యాల డైరక్షన్ లో వచ్చిన చంటబ్బాయి మూవీ లో చిరు కామెడీ నటన అద్భుతమని చెప్పాలి.
chantabbai
నటుడిగా మంచి పీక్ స్టేజ్ లో ఉండగా కె విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా స్వయంకృషి. 1987లో వచ్చిన ఈ మూవీ చేయడమే ఓ సాహసం. చెప్పులు కుట్టే సాంబయ్య పాత్రలో చిరు నటనకు అద్దం పట్టింది. క్లాసిక్ గా, కమర్షియల్ గా విజయం సాధించిన ఈ మూవీతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. 1988లో మెగాస్టార్ చేసిన మరో ప్రయోగం రుద్రవీణ. కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా,మూడు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టిన ఈ సినిమా చిరు కేరీర్ లో శాశ్వతంగా నిలిచిపోయింది.
acharya movie status worrying fans
ఇక మెగాస్టార్ గా తన పేరు మారుమోగుతున్న 1982సమయంలో చిరు చేసిన ఆపద్భాందవుడు మూవీ లో అతడి నటుణ్ని మరోసారి ఆవిష్కరించింది. ఉత్తమ నటుడిగా నంది పురస్కారం, ఫిలిం ఫేర్ అవార్డు పొందాడు. ఇక సినిమాల్లో రీ ఎంట్రీ తర్వాత 2019లో చిరు చేసిన సైరా నరసింహారెడ్డి మూవీలో నటన అద్భుతం. చారిత్రాత్మక స్వాతంత్ర్య సమరయోధుడు పాత్రలో చిరు ఒదిగిపోయారు.
https://www.chaipakodi.com/