Healthhealth tips in telugu

కాఫీ,నార్మల్ టీ,గ్రీన్ టీ తాగేవారు తెలుసుకోవలసిన రహస్యం…మిస్ కాకండి

coffee and tea Benefits In telugu : ఉదయం సమయంలో ప్రతి ఒక్కరూ కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు అయితే పరగడుపున కాఫీ టీ వంటివి తాగకూడదు ఈ విధంగా తాగితే కొన్ని రకాల సమస్యలు వస్తాయి. కాఫీ టీలో ఉండే కెఫీన్ అనే రసాయనం ఆమ్ల లక్షణాలతో ఉండి ఖాళీ కడుపుతో తాగటం వలన ఆమ్ల సమతుల్యత దెబ్బతింటుంది దాంతో కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి

అలాగే నిర్జలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉంది నోట్లో ఆమ్ల స్థాయి పెరిగితే పంటి ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంది. కాఫీ టీ తాగటానికి మంచి సమయం ఏమిటి అని ఆలోచిస్తే మధ్యాహ్నం భోజనం అయ్యాక గంట లేదా 2 గంటలు గ్యాప్ ఇచ్చి తాగవచ్చు
Green Tea Benefits In telugu
ఉదయం తాగాలి అని అనుకుంటే బ్రేక్ ఫాస్ట్ అయ్యాక తాగాలి. సాయంత్రం సమయం రాత్రి సమయంలో కాఫీ లేదా టీ తాగితే రాత్రి సమయంలో నిద్ర సరిగా పట్టదు. ఉదయం పరగడుపున గ్రీన్ టీ తాగవచ్చు. గ్రీన్ టీ తాగడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పరగడుపున తాగాలి అని అనుకుంటే గ్రీన్ టీ తాగాలి కాఫీ టీలు మాత్రం ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే తాగాలి ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/