Beauty Tips

అరటి పండుతో ఇలా చేస్తే చాలు జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Banana Hair Pack : జుట్టు రాలే సమస్యతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలే సమస్య,జుట్టు చివర్లు చిట్లటం, చుండ్రు సమస్యలను తగ్గించటానికి ఇప్పుడు చెప్పే ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది. ఈ ప్యాక్ కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అరటిపండును తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ కాఫీ పొడి రెండు స్పూన్ల పెరుగు వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి. ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే మంచి ఫలితం వస్తుంది. అరటిపండులో ఉన్న విటమిన్ లు,మినరల్స్ జుట్టు రాలకుండా సహాయపడతాయి.

మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. అరటిపండు,కాఫీ పొడి,పెరుగు ఈ మూడు కలిపి జుట్టు సమస్యలకు ఒక మేజిక్ వలె పనిచేస్తాయి. అరటిపండులో పొటాషియం, ప్రోటీన్, సహజ నూనెలు తల మీద తేమ ఎక్కువగా ఉండేలా చేస్తాయి. పెరుగు తల మీద చర్మం తేమగా ఉండేలా చేసి చుండ్రు వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/