Healthhealth tips in telugu

ఈ బ్రేక్ ఫాస్ట్ వాటర్ అమృతంతో సమానం.. పొరపాటున పారేయకండి..

Black chana soaked water : నల్ల శనగలను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని వడకట్టి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనలో చాలా మంది శనగలను నంబెట్టిన నీటిని పారబోస్తూ ఉంటాం. ఈ నీటిని మన ఆరోగ్యానికి అమృతంగా నిపుణులు చెప్పుతూ ఉంటారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
chickpeas in telugu
ఈ నీటిని తాగటం వలన అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అలాగే అలసట,నీరసం,నిసత్తువ లేకుండా రోజంతా చురుకుగా ఉంటారు. డయబెటిస్ ఉన్నవారు ఈ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
gas troble home remedies
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. దీనితో పాటు గ్యాస్, అజీర్ణం, మంట, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. చర్మాన్ని అంతర్గతంగా శుభ్రపరచి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఈ నీటిలో ఫైబర్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్‌లు ఉంటాయి. కాబట్టి శరీరంలోని అనేక సమస్యలను తొలగిస్తాయని నిపుణులు చెప్పుతున్నారు.
Diabetes diet in telugu
నల్ల శనగల నీటిని అలాగే తాగవచ్చు. లేదా ఈ నీటిలో ఉప్పు, నిమ్మరసం లేదా తేనె కలుపుకొని కూడా తాగవచ్చు. అలాగే గోరువెచ్చగా చేసి కూడా తాగవచ్చు. ఇలా తాగటం కుదరని వారు ఈ నీటిని చపాతీ పిండి కలిపినప్పుడు ఉపయోగించవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.