Beauty Tips

ఈ పేస్ట్ లో తేనె కలిపి ముఖానికి రాస్తే మొటిమలు,మచ్చలు అన్నీ మాయం అవుతాయి

Pimples remove and face glow Tips : మన వంటింటిలో పోపుల డబ్బాలో ఉండే మెంతులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులతో చిన్న చిన్న చిట్కాలు చేస్తే అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మొటిమలు,మొటిమల మచ్చలు తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీని కోసం ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
fenugreek seeds Benefits in telugu
గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతులను నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో చిటికెడు పసుపు,అరస్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 2 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మొటిమలు, మచ్చలు, రంధ్రాల సమస్యలు అన్ని తొలగిపోతాయి.

ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మొటిమలకు బెస్ట్ చిట్కా అని చెప్పవచ్చు. మెంతులు చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అలాగే పసుపు,తేనె కూడా మొటిమలు,నల్లని మచ్చలను తొలగించటంలో చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.