షుగర్ ఉన్నవారు ఆపిల్ తింటే ఏమి అవుతుందో తెలుసా ?
Apples and diabetes Care : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో తీసుకొనే ఆహారం విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు ఆపిల్ తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
పండ్లను ఎంచుకొనేటప్పుడు తక్కువ చక్కెరలు ఉన్న వాటిని ఎంచుకోవాలి. అలాగే గ్లైసెమిక్ సూచిక మీద శ్రద్ద పెట్టాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆహారంలో లభించే కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారడానికి ఎంత సమయం పడుతుందో కొలవడం.. రోజుకి ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని చెప్పుతూ ఉంటారు.
డయాబెటిస్ ఉన్నవారు ఆపిల్ ని లిమిట్ గా తినవచ్చు. ఆపిల్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ సహాయపడుతుంది. ఆపిల్ లోని ఫైబర్ కారణంగా ఆపిల్ లోని ఫ్రక్టోజ్ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయదు. ఆపిల్ ని ముక్కలుగా కట్ చేసి తింటేనే ఫైబర్ అందుతుంది. జ్యూస్ రూపంలో తీసుకుంటే ఫైబర్ కంటెంట్ తగ్గి చక్కెర శాతం పెరుగుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఆపిల్ ని ముక్కల రూపంలో తినాలి. జీర్ణక్రియను నెమ్మది చేసి చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. ఆపిల్ తినటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. అందుకే ఆపిల్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదని చెబుతారు. చర్మంలోని యాంటీ ఆక్సిడెంట్లు ప్యాంక్రియాస్‌ను ఇన్సులిన్‌ను విడుదల చేసేలా ప్రేరేపిస్తాయి.
ఇది కణాలలో చక్కెరను సరిగ్గా గ్రహించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రోజుకి ఒక ఆపిల్ మాత్రమే తీసుకోవాలి. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ఏదైనా లిమిట్ దాటితే అనర్ధమే కదా. డయాబెటిస్ నియంత్రణలో ఉండాలంటే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/