షుగర్ ఉన్నవారు బెల్లం తింటే ఏమి అవుతుందో తెలుసా?
Is jaggery good for diabetes : డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి తీసుకొనే ఆహారం విషయంలో ఎన్నో సందేహాలు ఉంటాయి.
మనలో చాలా మందికి డయాబెటిస్ ఉన్నవారు పంచదార తింటే మంచిదా… బెల్లం తింటే మంచిదా… అనే సందేహం ఉంటుంది. పంచదార…, బెల్లం రెండు ఒకే పదార్ధం నుండి తయారు అవుతాయి. అలాగే క్యాలరీలు కూడా సమానంగా ఉంటాయి.. గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా రెండింటికీ ఎక్కువే.
బెల్లం విషయానికొస్తే సహజసిద్ధంగా తయారు చేస్తారు కాబట్టి పోషకాలు అలానే ఉంటాయి. పంచదార శుద్ధి ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. డయాబెటిస్ ఉన్నవారు పంచదారకు బదులుగా బెల్లం వాడవచ్చు. అయితే పరిమిత మోతాదులో మాత్రమే వాడాలి. ముదురు రంగులో ఉండే బెల్లం మంచిది. .
లేత రంగులో ఉండే బెల్లంలో రసాయనాలు కలుపుతారు. బెల్లం ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు. అలాగే శ్వాసకోస వ్యవస్థ శుభ్రం అవుతుంది. కాబట్టి మామూలు ఆరోగ్యవంతులు కూడా పంచదారకు బదులు బెల్లం వాడితేనే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/