Boiled Eggs: ఉడికించిన గుడ్లను ఎక్కువసేపు నిల్వ ఉంచితే..ఎన్ని గంటల్లో తింటే లాభం..
Boiled Eggs:గుడ్డులో ఉన్న పోషకాల కారణంగా డాక్టర్స్ కూడా ప్రతి రోజు ఒక గుడ్డు తినమని చెప్పుతున్నారు. Egg లో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు మనలో చాలా మంది గుడ్డును ఎంతో ఇష్టంగా తింటారు. కొంత మంది కోడి గుడ్డును పాలల్లో కలుపుకొని తాగుతారు. మరి కొంత మంది కూరగా చేసుకొని తింటారు, అయితే కొంతమంది కోడిగుడ్డును ఉడికించి తింటూ ఉంటారు.
మనలో చాలా మందికి ఉడికించిన కోడి గుడ్డును ఎన్ని గంటల లోపు తినాలి అనే విషయంలో సందేహం ఉంటుంది. చాలా మంది గుడ్డును ఉదయం ఉడికించి సాయంత్రం సమయంలో తింటూ ఉంటారు. లేకపోతే ఒకేసారి ఉడికించుకొని ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో పెట్టి తింటూ ఉంటారు. కోడి గుడ్డును ఉడికించిన తర్వాత రెండు లేదా మూడు గంటల లోపు తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు.
Egg లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సరైన రీతిలో వాడితేనే వాటిలో ఉన్న ప్రయోజనాలు మనకు అందుతాయి. సరిగ్గా వాడకపోతే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి Egg తినేవారు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

