Duck Walk Exercise:డక్ వాకింగ్ (బాతు నడక) ఎప్పుడైనా చేసారా..ఊ హించని ఎన్నో ప్రయోజనాలు
Duck Walk Exercise:మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు వ్యాయామం చేయాలి. అలాంటి వ్యాయామాలలో డక్ వాకింగ్ ఒకటి. డక్ వాకింగ్ ఎలా చేయాలి. ఈ వ్యాయామం చేయటం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి రోజు కనీసం అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.
డక్ వాకింగ్ అంటే…ఒక రకంగా చెప్పాలంటే మిలిటరీ వ్యాయామం అని చెప్పవచ్చు. గుంజీలు తీస్తున్నట్లుగా కూర్చొని రెండు చేతులను కలిపి పట్టుకొని…అలాగే కూర్చొని ముందుకు నడవాలి. కొంచెం సేపు ముందుకు కొంచెం సేపు వెనక్కి నడవాలి. దీనినే Duck Walk అని అంటారు. దీని వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
ఈ వ్యాయామం శరీరం దిగువ బాగం కదలికలను మెరుగుపరుస్తుంది. చీలమండలు, మోకాళ్లను ఫ్లెక్స్ బుల్ చేస్తుంది అలాగే దిగువ కండరాలను సక్రియంచేసి తుంటి భాగాన్ని విస్తరిస్తుంది.శక్తి స్థాయిలను పెంచుతుంది. అథ్లెటిక్ లకు ఈ వ్యాయామం చాలా బాగా సహాయపడుతుంది. ఎక్కువ దురం పరుగు తీయటానికి అథ్లెటిక్ లకు హెల్ప్ అవుతుంది.
ఈ Duck Walk చేయటం వలన తొడ కండారాలు, కాళ్లు, చీలమండల కండరాలు బలోపేతం అవుతాయి. నడకను,పరుగును మెరుగుపరుస్తుంది. శరీరం దిగువ బాగంలో ఫ్లెక్సిబిలిటీని, సమతుల్యతను అందిస్తుంది.
గర్భిణీ స్త్రీలు ఒకరి సహాయంతో డక్ వాక్ చేయటం చాలా మంచిది. ఇది వారిలో వెన్నునొప్పిని తగ్గించటమే కాకుండా శక్తి సామర్థ్యాలను పెంచుతుంది. అయితే గర్భిణీ స్త్రీలు డాక్టర్ సూచన ప్రకారం మాత్రమే Duck Walk చేయాలి. ఈ విషయాన్నీ గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News