Healthhealth tips in telugu

Pudina.. Kothimeera:పుదీనా.. కొత్తిమీర..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది…?

Pudina..Kothimeera:ప్రస్తుతం ఆకుకూరలు చాలా విరివిగా లభిస్తున్నాయి. ఆకుకూరలు చాలా చవకగా ఎక్కువ పోషకాలతో నిండి ఉంటాయి. మనలో చాలా మంది వాసన కారణంగా పుదీనా.. కొత్తిమీర వాడటానికి అసలు ఇష్టపడరు.

కొత్తిమీర,పుదీనా రెండింటిలోను పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ రెండింటిలోను యాంటీ ఇన్ ఫ్లేమేటరీ లక్షణాలు ఉన్నాయి. వీటిని తాజాగా లేదా ఎండబెట్టి నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. కొత్తిమీర విషయానికి వస్తే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్దిగా ఉంటుంది.

అందువల్ల ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా వచ్చే కణాల డ్యామేజ్ ని తగ్గిస్తుంది. అలాగే శరీరంలో మంటను తగ్గిస్తుంది. అలాగే టోకోఫెరోల్స్, టెర్పినేన్ మరియు క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కొత్తిమీర యాంటీకాన్సర్ మరియు న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటుంది.

చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండెకు సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కొత్తిమీరలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ అభివృద్ది ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొత్తిమీర ప్రేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించి జీర్ణక్రియకు సహాయపడుతుంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉండుట వలన అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

ఇక పుదీనా విషయానికి వస్తే మలబద్ధకం, తిమ్మిరి, కడుపు ఉబ్బరం మరియు అతిసారం నుండి ఉపశమనం కలిగిస్తుంది.పుదీనాలో ఉండే మెంథాల్‌ అనే క్రియాశీల సమ్మేళనం కాల్షియం ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అలాగే కండరాలను సడలించడంలో సహాయపడుతుంది.
కాల్షియం కండరాల సంకోచానికి బాధ్యత వహించే chemical messenger గా పనిచేస్తుంది.

పుదీనాలో విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటిని ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే కంటికి సంబందించి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. పుదీనాలో ఉండే మెంథాల్ జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం,కడుపు నొప్పి వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. శ్వాస సంబంద సమస్యలు లేకుండా చేసి దగ్గు,జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నోటి దుర్వాసన తగ్గించి నోటి దుర్వాసనకు కారణం అయిన బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. పుదీనాతో పోలిస్తే కొత్తిమీరలోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పుదీనా కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News