Headache Remedies:ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే.. 45 సెకండ్లలో తల నొప్పి పరార్…!!!
Headache Remedies :ఈ మధ్య కాలంలో ఎక్కువగా టివీ,ఫోన్ వంటివి ఎక్కువగా చూడటం వలన తలనొప్పి చాలా త్వరగా వచ్చేస్తుంది. మనలో చాలా మంది తలనొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు చెప్పే టెక్నిక్ పాటిస్తే తలనొప్పి,ఒత్తిడి,టెన్షన్ వంటివి అన్నీ మాయం అవుతాయి.
ఇవాళ, రేపు మార్కెట్ లో ఎన్నో మసాజ్ టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి. మసాజ్ వల్ల శరీరానికి ఆరోగ్యమే కాదు, మానసికంగా గా కూడా స్వస్థత చేకూరుతుంది. కానీ, కాస్త ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే, మసాజ్ చెయ్యించుకోవడానికి ఖాళీ టైం ఉంటే కదా.
అయితే కూర్చున్న చోటే కూర్చుని, మసాజ్ ద్వారా వెంటనే రిలాక్స్ అవ్వడానికి ఒక టెక్నిక్ దొరికింది. మీ మనస్సులో ఏ మాత్రం టెన్షన్ అనిపించినా… రిలాక్స్ అవ్వలనిపించినా వెంటనే ఈ టెక్నిక్ ప్రయోగించచ్చు.
ఏం లేదు. జస్ట్ మీ నుదుటి పై బొట్టు పెట్టుకునే భాగం…
అసలు ఏం చెయ్యాలంటే?
1. మీ కనురెప్పలు కరెక్ట్ గా మధ్యలో ఉన్న భాగాన్ని ఏదైనా ఒక వేలితో సున్నితంగా నొక్కి పట్టుకోవాలి.
2. అక్కడ నుంచి పైకి మూడు సెంటిమీటర్లదాక వేలితో స్పృసిస్తూ మెల్లగా మసాజ్ చెయ్యాలి
3. అలా 45 నుండి 6 సెకండ్ల వరకు చేసినా చాలు వెంటనే రిజల్ట్ కనపడటం మొదలవుతుంది. వెంటనే రిలాక్స్ అయ్యిన ఫీలింగ్ ఉంటుంది
ఇలా జరగడానికి ఎక్స్పర్టులు చెప్పిన వివరణ ఏంటంటే ‘మెదడులోని నర్వస్ టెన్షన్ తగ్గించే భాగం ఇందువల్ల యాక్టివేట్ అవుతుంది. అంతే కాదు కంటి దగ్గర కనిపించే తీరు కూడా మారుతుంది.ఇంకేంటి లేటు. ఎప్పుడైనా తల నొప్పి వచ్చినా, అలసిపోయినా, బాగా టెన్షన్ గా ఉన్న సరే ఈ టెక్నిక్ వాడేసెయ్యండి మరి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News