Meditation : మెడిటేషన్ చేస్తే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు
Meditation : ఈ రోజుల్లో మారిన జీవన ప్రమాణాల కారణంగా మనిషి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోవటంతో పాటు,పలు శారీరక రుగ్మతలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డిప్రెషన్ అనేది చాలా మందిని బాదిస్తున్న తీవ్రమైన సాదారణ సమస్య.
దీన్ని నుంచి తప్పించుకోవటానికి కొందరు మందులను ఆశ్రయిస్తే,మరికొందరు యోగ,మెడిటేషన్ వంటి వాటిని అనుసరిస్తున్నారు. మెడిటేషన్ కారణంగా డిప్రెషన్ నుంచి విముక్తి లభించి మానసిక ఆనందం,ప్రశాంతత చేకూరుతుందనే విషయం తెలిసిందే.
మెడిటేషన్ మానసిక ప్రశాంతతతో పాటు శారీరక రుగ్మతలను,నొప్పులను తగ్గిస్తుందని మాంచె స్టర్ యూనివర్శిటీ పరిశోదకులు నిర్వహించిన ఒక పరిశోదనలో తెలిసింది. శారీరక రుగ్మతలను తగ్గించటంలో మెడిటేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది?అన్న విషయం మీద పరిశోదకులు విస్తృతంగా పరిశోదనలు చేసి పై విషయాన్నీ చెప్పారు.
కీళ్ళ నొప్పులను తగ్గించుటలో మెడిటేషన్ కీలకపాత్ర పోషిస్తుందని,అలాగే నొప్పుల కారణంగా కలిగే భావోద్వేగాలను కూడా అదుపులో ఉంచుతుంది. మెడిటేషన్ చేయని వారిలో కంటే చేసిన వారిలో ఈ మార్పులను పరిశోదకులు గుర్తించారు. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవటం కష్టం.
దీర్ఘకాలం పాటు మెడిటేషన్ చేసే వారిలో మాత్రమే ఈ మార్పు సాధ్యం అవుతుంది. మెడిటేషన్ మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా నొప్పుల వల్ల వచ్చే భావోద్వేగాలను మెదడు అదుపులో ఉంచుతుంది.
ముఖ్యంగా క్రానిక్ పెయిన్ ను తగ్గించటానికి మెడిటేషన్ చాలా బాగా పనిచేస్తుందని పరిశోదనలో తేలింది. అయితే మెడిటేషన్ కారణంగా మెదడులో జరిగే ప్రక్రియల గురించి విస్తారంగా పరిశోదనలు చేయవలసి ఉంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News