Healthhealth tips in telugu

Sleeping Position : నిద్రపోయేటప్పుడు ఏ వైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిది?

Sleeping Position : నిద్రపోయేటప్పుడు పడుకునే భంగిమ కూడా మన ఆరోగ్యం మీద కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. కొంత మంది కుడి వైపుకు తిరిగి పడుకుంటే.. మరి కొంత మంది ఎడమ వైపుకి తిరి పడుకుంటే.. మరి కొంత మంది బోర్లా పడుకుంటారు.

అయితే ఎడమ వైపు తిరిగి పడుకుంటే మంచిదని ఆయుర్వేదం చెప్పుతుంది. ఎడమ వైపుకు తిరిగి పడుకొనే వారిలో మెదడు సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి.. వ్యర్ధాలు, టాక్సిన్స్ వంటివి పెద్ద పేగు ద్వారా బయటికి పోతాయి.

గుండె ఆరోగ్యానికి మంచిది. మన శరీరంలో గుండె ఎడమవైపే ఉంటుంది. కాబట్టి మనం ఎడమ వైపు తిరిగి పడుకుంటే రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది.

గర్భిణులు ఎడమ వైపు తిరిగి పడుకోవటం మంచిది. దీనివల్ల గర్భాశయానికి, పిండానికి రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. బిడ్డకు పోషకాలు సులభంగా అందుతాయి. కాబట్టి గర్భిణీలు ఎడమ వైపు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి.

ఆయాసం,గురక ఉన్నవారు కూడా ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే మంచిది. శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుంది. కాబట్టి గురక వచ్చే అవకాశం ఉండదు.కాబట్టి ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఎన్ని ఇన్ని లాభాలు కలుగుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News