Rava Khajoor:నోట్లో వెన్నలా కరిగిపోయేలా గుల్లగా ఎంతో రుచిగా మరెంతో ఈజీగా చేసుకొనే స్వీట్
Rava Khajoor:బలాన్నిచ్చే ఖర్జూరాలతో ఎన్నో స్పెషల్స్ చేస్తునే ఉంటాం. రవ్వ ,పంచదారలో కలిపి రవ్వ కర్జూర్ ఎలా చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
బొంబాయి రవ్వ – 1 ½ కప్పు
కొబ్బరి పొడి – ½ కప్పు
చక్కెర – 1 కప్పు
చెర్రీస్ – ¼ కప్పు
ఎండు ఖర్జూర తురుము – ½ టేబుల్ స్పూన్స్
నూనె – 1 టేబుల్ స్పూన్
బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్
యాలకుల పొడి – ½ టీ స్పూన్
పైనాపిల్ ఎసెన్స్ – 4-5 చుక్కలు
నూనె – ఫ్రై కి సరిపడా
తయారీ విధానం
1.రవ్వలో నూనె,బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.
2.కొబ్బరి పొడి ,చెర్రీస్ తరుగు,ఎండు ఖర్జూరం ముక్కలు కొద్దిగా నీళ్లు పోసి రవ్వ కి కలపాలి.
3.తడిచిన రవ్వలో పంచదార,యాలకుల పొడి,మిగిలిన నీళ్లు పోసి రవ్వని ముద్దగా కలిపి అరగంట పాటు నానపెట్టుకోవాలి.
4.అరగంట నానిన రవ్వలో ఫైనాపిల్ ఎసెన్స్ వేసి కలుపుకోవాలి.
5.మరిగే నూనెలో గోళాలు లా వేసి మీడియం ఫ్లేమ్ పై ఫ్రై చేసుకోవాలి.
6.మూడు నిమిషాలు వేపుకుంటే కరకరలాడుతు ఉంటాయి..చల్లారకా ఎయిర్ టైట్ కంటేరర్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.
Click Here To Follow Chaipakodi On Google News