Chocolate Lava Cake: క్రిస్మస్, దీపావళి వంటి పండుగలకు మరియు స్పెషల్ సెలెబ్రేషన్స్ కి చాలా సింపుల్ గా చాక్లెట్ లావా కేక్ చేసుకోవచ్చు
Chocolate Lava Cake: చాక్లెట్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవ్వరు ఉండరు. అడిగిన ప్రతి సార్ మార్కెట్ కి వెల్లే పనిలేకుండా ఇంట్లో ఇలా చాక్లెట్ కేక్స్ ని తయారు చేసి ఇవ్వండి.
కావాల్సిన పదార్ధాలు
పాలు – 3 కప్పులు
ఓరియో – 3 ప్యాకెట్స్
డైరీ మిల్స్ చాక్లెట్స్ – 1
తయారీ విధానం
1.డబుల్ బాయిలర్ పద్దతిలో ఒక గిన్నెలో డైరీ మిల్క్ చాక్లెట్ వేసి వేడినీళ్లలో పెట్టడం వల్ల చాక్లెట్ కరిగిపోతుంది.
3.అందులోకి రెండు స్పూన్ల పాలు వేసి చిక్కపడేవరకు కలుపుతూ ఉండాలి.
4.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చాక్లెట్ పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి.
5.ఇప్పుడు మిక్సి జార్ లో బిస్కేట్ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
6.గ్రైండ్ చేసుకున్న బిస్కేట్ పౌడర్ని పాలతో మిక్సి చేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
7.స్టీమింగ్ కప్పులకు లేదా ఇడ్లీ పాత్రలకు అడుగున నూనె రాసి అడుగున రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి.
8.ఇప్పుడు నూనె రాసుకున్న కప్పులో సగం వరకు బిస్కేట్ పేస్ట్ ని పోయాలి,అపై కరిగించిన చాక్లెట్ మల్లీ బిస్కేట్ పేస్ట్ ని వేసుకోవాలి.
9.వేసుకున్న కప్స్ లేదా,ఇడ్లీ ప్టేట్స్ ని ఆవిరి పై ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించాలి.
10.ఎనిమిది నిమిషాల తర్వాత చాక్లేట్ ని చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
11.అంతే ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న పదార్ధాలతో చాక్లెట్ కేక్ రెడీ.