Kitchenvantalu

Beerakaya Senagapappu Masala:ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా చేస్తే బీరకాయ ఇష్టం లేని వారు తింటారు

Beerakaya Senagapappu Masala: ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలంటే చాలా వరకు ఇష్టపడరు. బీరకాయ రెసిపి అంటే పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు.కాని శనగపప్పు తో మిక్సి చేసి మసాలా కర్రీ చేసి చూడండి బీరకాయ కూడ వదలకుండా తినేస్తారు.

కావాల్సిన పదార్ధాలు
బీరకాయ – ¼ kg
శనగపప్పు – ½ కప్పు
పచ్చిమిర్చి – 2
ఉల్లిపాయలు – 1
జీలకర్ర – ½ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
కారం – 1/ ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత
ధనియాలు – 1 టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా బీరకాయలను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసిపెట్టుకోవాలి.
2.శనగపప్పు అరగంట పాటు నానబెట్టుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకోని అందులోకి ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర ,ఆవాలు,తరగిని పచ్చిమిర్చి,ఉల్లిపాయలు వేసి రంగుమారే వరకు వేపుకోవాలి.
4.ఉల్లిపాయలు వేగాక పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక బీరకాయ ముక్కలను వేసి కలుపుకోని మూతపెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.
5.ఇప్పుడు అందులోకి నానబెట్టుకున్న శనగపప్పు వేసి కారం,ఉప్పు,ధనియాలపొడి వేసి బాగా కలుపుకోని కప్పు నీళ్లను జోడించి నిమిషం పాటు ఉడకనివ్వాలి.
6.నిమిషం తర్వాత బీరకాయ కర్రీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీరకాయ మసాలా శనగపప్పు కూర రెడీ.