Kashmiri Firni Kheer:బియ్యంతో ఇలా స్వీట్ చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..
Kashmiri Firni Kheer:హైదరబాదీ స్పెషల్ స్వీట్ ఫిర్నీ ఖీర్ స్ట్రీట్ ఫుడ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
బాస్మతి రైస్ – 4 టేబుల్ స్పూన్
పాలు – 1 లీటర్
కోహా -3 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు – 4 టేబుల్ స్పూన్స్
చక్కెర – 4-5 టేబుల్ స్పూన్
యాలకులు పొడి – కొద్దిగా
బాదం పిస్తా – సరిపడా
రోజ్ వాటర్ – 4 చుక్కలు
తయారీ విధానం
1.బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి.
2.నానిన బియ్యాన్ని మిక్సి జార్ వేసుకోని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
3.గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి.
4.ఇప్పుడు స్టవ్ పై నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోని అందులోకి పాలు పోసి మరగనివ్వాలి.
5.అడుగు అంటకుండా కలుపుతు కాస్త చిక్కపడే వరకు మరిగించాలి.
6.మరుగుతున్న పాలలో గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని వేసి కొద్దిగా నీళ్లు యాడ్ చేసి కలుపుకోవాలి.
7.లో ఫ్లేమ్ పై మిశ్రమం చిక్కపడే వరకు ఉడికించాలి.
8.ఉడుకుతున్న మిశ్రమంలో డ్రై ఫ్రూట్స్ పొడిని వేసుకోవాలి.
9.చక్కెర వేసి కరిగే వరకు కలుపుకోవాలి.
10.చక్కెర కరిగాక అందలోకి కోహా జోడించి కరిగించుకోని కాస్త చిక్కపడ్డాక అందులోకి యాలకకుల పొడి నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
11.స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
12.చల్లారిన స్వీట్ లోకి కుంకుమ పువ్వు బాదం,పిస్తా లతో గార్నిష్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే.


