Thotakura :తోటకూర తినడం లేదా? అయితే.. ఇవి మిస్ చేస్తున్నట్లే!
Thotakura Health benefits in telugu:ఈ చలికాలంలో చాలా చవకగా దొరికే ఆకుకూరలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వారంలో రెండు సార్లు ఆకుకూరలను తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
ఈ సీజన్ లో మనకు ఆకుకూరలు చాలా విరివిగానే లభిస్తాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను అందిస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు తోటకూర తింటే ఐరన్ సమృద్దిగా లభించి రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. తోటకూర మనకు విరివిగానే లభ్యం అవుతుంది.
తోటకూరతో పప్పు,కూర,పులుసు వంటివి చేసుకొని వారంలో మూడు సార్లు తీసుకోవాలి. రక్తహీనత సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. ఎందుకంటే రక్తహీనత కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఆహారంలో మార్పులు చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి.
ఐరన్ అనేది ఎర్రరక్తకణాల ఉత్పత్తికి మరియు సెల్యులార్ జీవక్రియకు సహాయపడుతుంది. తోటకూర కూర లేదా జ్యూస్ చేసినప్పుడు నిమ్మరసం పిండి తీసుకుంటే నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరం ఐరన్ శోషించటానికి సహాయపడుతుంది. విటమిన్ a సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది.
తోటకూరను తినటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి కాల్షియం లోపం లేకుండా ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తోటకూరను వారంలో రెండు సార్లు తీసుకుంటే మంచిది.
తోటకూరలో విటమిన్ ఏ తో పాటు సీ విటమిన్, డీ విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, విటమిన్ బీ-12, విటమిన్ బీ-6,మెగ్నీషియం, పాస్ఫరస్, కాల్షియం, ఇనుము, జింక్, కాపర్, సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. కాబట్టి శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలు అందుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


