Healthhealth tips in telugu

Digestive Drinks: అజీర్తితో త‌ర‌చూ స‌త‌మ‌త‌మ‌వుతున్నారా.. ఈ ఒక్క చిట్కా పాటిస్తే లైఫ్‌లో ఆ స‌మ‌స్యే ఉండ‌దు

Digestive Drinks: ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినటానికి అలవాటు పడటం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్,అజీర్ణం వంటి సమస్యలు చాలా తొందరగా వచ్చేస్తాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మారిన జీవన శైలి, తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు లేకపోవటం, సరైన సమయంలో భోజనం చేయకపోవడం వంటి కారణాలతో గ్యాస్ సమస్య అలాగే ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే చాలామంది ఇంగ్లీష్ టాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు.

అలా కాకుండా మన ఇంటిలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. గుండెల్లో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక లీటర్ నీటిని తాగాలి. అలా తాగడం వల్ల జీర్ణాశ‌యంలో అధికంగా ఉత్ప‌త్తి అయ్యే గ్యాస్ తగ్గి ఆ సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.

గ్యాస్ సమస్య ఉన్నప్పుడు పడుకోకుండా కూర్చుని ఉంటే మంచిది. ఎందుకంటే కూర్చోవడం వల్ల గ్యాస్ పైకి రాకుండా ఉంటుంది. పడుకుంటే మాత్రం గ్యాస్ పైకి వస్తుంది. దీంతో సమస్య మరింత ఎక్కువ అవుతుంది. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు గుండెల్లో మంటగా అనిపించినప్పుడు అరటిపండు యాపిల్ వంటి పండ్లను తినాలి.

ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పుదీనా రసం కలుపుకొని తాగితే గ్యాస్, ఎసిడిటీ, గుండెల్లో మంట నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఒక గ్లాసు చల్లని మజ్జిగ తాగినా కూడా మంచి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.