Healthhealth tips in telugu

Curd for weight loss: పెరుగును ఇలా తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు!

Curd for weight loss: పెరుగులో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు పెరుగు తింటే ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు. కొంత మంది పెరుగును తినటానికి ఆసక్తిగా ఉండరు.

స్లిమ్‌గా ఉండేందుకు మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. కొంత మంది ఆహారం తక్కువగా తీసుకుంటారు. కడుపు మాడ్చుకుంటారు. కానీ అలా చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆహారం ఎక్కువగా తీసుకోకపోయినా పౌష్టికాహారం తింటే చాలా మంచిది. అధిక బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినవచ్చు.

పెరుగు తింటే స్థూలకాయం వస్తుందని చాలా మంది అపోహ. కానీ అది పొరపాటు. ప్రతిరోజూ కప్పు పెరుగు తీసుకుంటే అధిక బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ఉండే క్యాల్షియం శరీరంలో కొవ్వును తగ్గించి స్లిమ్‌గా ఉండేలా చేస్తుంది. హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. పెరుగులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి.

పెరుగును తరచుగా తీసుకుంటే ఇతర చిరుతిండి పదార్థాలు తీసుకోవాలనిపించదని పరిశోధకులు చెబుతున్నారు. చిరుతిండి పదార్థాలు ఎక్కువగా తినడం వలన అధికంగా బరువు పెరుగుతారు, దాంతో కడుపు కూడా పెరుగుతుంది. కనుక పెరుగును తప్పకుండా డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది. 300 గ్రాముల పెరుగులో 200 గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెప్తున్నారు.

ఈ క్యాల్షియం కడుపులోని కొవ్వును బయటకు పంపుటకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే జీర్ణ సంబంద సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ప్రతి రోజు పెరుగు తినటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనలో చాలా మంది పెరుగు తినటానికి ఆసక్తి చూపరు. అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్న పెరుగును అసలు మిస్ చేసుకోవద్దు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.