Kitchenvantalu

Sweet Corn Vada:తినే కొద్దీ తినాలనిపించే కార్న్ వడలు క్రిస్పీగా రుచిగా రావాలంటే ఇలా చేస్తే సరి

Sweet Corn Vada: ఈ సీజన్ లో Sweet Corn చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. Sweet Corn లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. Sweet Corn ని ప్రతి సారి ఉడికించి తింటే బోర్ కొడుతుంది. అలాగే పిల్లలు కూడా తినటానికి ఇష్టపడరు. Sweet Corn Vada చేస్తే చాలా ఇష్టంగా తింటారు. Sweet Corn Vada తయారుచేయటం కూడా సులభం.

కావలసిన పదార్ధాలు
ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు
అరకప్పు ఉల్లిపాయ ముక్కలు
ఒక పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేయాలి
ఒక అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి
రెండు రెబ్బల కరివేపాకు
ఒక క్యారెట్ తురమాలి
రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు
పావు స్పూన్ పసుపు
పావు కప్పు శనగపిండి
పావు కప్పు బియ్యప్పిండి
అర స్పూన్ ఉప్పు
నూనె వేగించడానికి

తయారీ విధానం
ఒక స్వీట్ కార్న్ తీసుకొని గింజలను వలిచి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. స్వీట్ Corn పేస్ట్ ని ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా తయారు చేసుకుని నూనెలో వేగిస్తే చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు రెడీ. సాయంత్రం TEA సమయంలో స్నాక్ రూపంలో తీసుకుంటే చాలా బాగుంటాయి. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.