Beauty Tips

Skin Care Tips:నిమ్మరసంలో కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, మచ్చలు మాయం అయ్యి ముఖం మెరుస్తుంది

Turmeric Face Packs : పసుపును పురాతన కాలం నుండి ముఖ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. పసుపులో ఉన్న లక్షణాలు చర్మ సంరక్షణ మరియు చర్మ సమస్యలను తగ్గించటానికి అద్భుతంగా పనిచేస్తుంది.

ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో అందాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. దాంతో మార్కెట్లో దొరికే క్రీమ్స్ కొనేసి వాడేస్తూ ఉంటారు. ఒక్కోసారి వాటి కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా కేవలం 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తే కాంతివంతమైన ముఖం మీ సొంతం అవుతుంది. మనకి ఇంటిలో ఉండే పసుపు ను ఉపయోగించి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

ఒక స్పూన్ పసుపులో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంటఅయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ అన్ని తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కా చేయటం చాలా సులువు.

ముఖం నిర్జీవంగా మారితే ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పాలమీగడలో పసుపు కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే కాంతివంతంగా మెరిసిపోతుంది.

రెండు టీ స్పూన్ల పాలలో అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ముంచి ఆ దూదితో ముఖంపై రాస్తూ ఉండాలి. ఇలా ఐదు నిమిషాలపాటు చేస్తూ ఉంటే చర్మంపై ఉన్న జిడ్డు, మురికి అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గంధం, పసుపు, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. ఈ చిట్కాలు అన్నీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.