Kidney Cleaning Drinks:ఈ డ్రింక్ తాగితే కిడ్నీలు మొత్తం క్లీన్ అయ్యి కిడ్నీలకు ఎటువంటి సమస్యలు ఉండవు
kidney problems homeremedies : ఈ మధ్యకాలంలో చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలకు సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే నెలకు ఒకసారి ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే కిడ్నీలు శుభ్రం అవుతాయి. అంతేకాకుండా కిడ్నీలు చాల ఆరోగ్యంగా ఉంటాయి.
స్పూన్ ధనియాలు తీసుకుని కచ్చాపచ్చాగా దంచాలి. ఒక గ్లాసు నీటిలో దంచుకున్న ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి. ధనియాలు గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా కిడ్నీలను శుభ్రం చేయుటలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
జీలకర్ర కూడా శరీరంలో గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్, అధిక బరువును తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రెండు గంటలు నానిన తర్వాత ధనియాలు, జీలకర్రతో సహా ఆ నీటిని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత ఒక నిమ్మకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరొక మూడు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి తేనె కలుపుకొని తాగాలి డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటేనే మంచిది. ఈ డ్రింక్ ఉదయం పరగడుపున తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు అలాగే ఉదయం సమయంలో తాగటం కుదరని వారు మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోవచ్చు.
ఈ డ్రింక్ నెలకు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. కిడ్నీలు శుభ్రం అవటమే కాకుండా పొట్ట అలాగే ప్రేగులు కూడా శుభ్రం అవుతాయి . మలబద్దకం వంటి సమస్యలను తొలగిస్తుంది. మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా ఫలితం కనబడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.