Kitchenvantalu

Vamu Rasam:వాము రసం ఇలా చేసి పెట్టండి.. అజీర్తి, కడుపు నొప్పి చిటికెలో మాయం

Vamu RAsam;వాము రసం.. దగ్గు ,జలుబు కి మంత్రంలా పనిచేసే వాముతో రసం పెట్టుకుంటే..చలికాలంలో,వర్షకాలంలో అరుగుదలకు,జీర్ణశక్తికి ఔషదంలా ఎంతో మేలు చేస్తుంది.

కావాల్సిన పదార్ధాలు
వాము – 1 స్పూన్
ఉల్లిపాయలు – 1
పచ్చిమిర్చి – 2
కొత్తిమీర – చిన్న కట్ట
కరివేపాకు – 2 రెమ్మలు
చింతపండు – 15-20 గ్రాములు
బెల్లం లేదా చక్కెర – 1 స్పూన్
తాలింపు గింజలు – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా ఒక గిన్నెలోకి ½ లీటర్ నీళ్లను తీసుకోవాలి.
2.అందులోకి చింతపండు రసం తోపాటు ఉప్పు,పసుపు,పచ్చమిర్చి,ఉల్లిపాయలు కలుపుకోవాలి.
3.కొత్తిమీర,కరివేపాకు కూడ కలుపుకోని కలిపిన మిశ్రమాన్ని మరిగించుకోవాలి.
4.చారు మరుగుతున్న సమయంలో అందులోకి చక్కెర లేదా బెల్లం వేసి కరిగించాలి.
5.వామును వేసి రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
6.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై బాండీ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి వేసి తాలింపు వేపుకోవాలి.
7.వేగిన తాలింపులోకి మరిగించుకున్న రసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.అంతే వేడి వేడి వాము రసం రెడీ.