Almond Tea: గుండె ఆరోగ్యం కోసం బాదం టీ..! ఈ ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం..
Almond Tea Benefits : మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. నార్మల్ టీ కాకుండా ప్రతిరోజు బాదం టీ తాగితే రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతిరోజు బాదం టీ తాగలేని వారు వారంలో రెండు సార్లు తాగితే సరిపోతుంది. 5 బాదంపప్పులను మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.
ఈ పొడిని ఒక గ్లాసు పాలల్లో కలిపి గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాలు మరిగించి ఒక గ్లాసులోకి వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు నీరు, ఒక స్పూన్ టీ పౌడర్, మూడు స్పూన్ల బ్రౌన్ షుగర్, అర స్పూన్ యాలకుల పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత వడగట్టి పెట్టుకున్న బాదం పాలను పోసి ఐదు నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేస్తే బాదం టీ రెడీ అయినట్టే. ఈ టీని ప్రతి రోజు తీసుకోవచ్చు…లేదంటే వారంలో రెండు లేదా మూడుసార్లు ఈ విధంగా బాదం టీ ని తాగితే మన శరీరానికి అవసరమైన పోషకాలు అంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన కణాలను ఆక్సీకరణ నష్టం నుండి నిరోధించడంలో సహాయపడి డయాబెటిస్ వంటి వ్యాధుల నుండి రక్షణ కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్, తలనొప్పి, ఆందోళన వంటి సమస్యలు లేకుండా మెదడు చురుగ్గా ఉండటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. రోజంతా హుషారుగా పనులను చేసుకోవటానికి అవసరమైన శక్తి లభిస్తుంది. కాబట్టి బాదం టీ తాగి ఈ ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.