Allam Murabba:చలికాలంలో 1 ముక్క తింటే జలుబు,దగ్గు,పైత్యం,వికారం,గ్యాస్ అన్ని మాయం..
Allam Murabba benefits : చలికాలం ప్రారంభం అయింది. చలికాలంలో వచ్చే సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకోవాలి.
ఈ సీజన్ లో అల్లం మురబ్బా తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఉదయం పరగడుపున అల్లం మురబ్బా ముక్కను తింటే చాలా మంచిది. ఘాటైన అల్లం, తియ్యని బెల్లం కలగలిసిన రుచి ఎంతో ప్రత్యేకంగా ఉండే అల్లం మురబ్బా తినటానికి మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా ఆ తర్వాత అలవాటు పడిపోతారు.
దీని తయారీ కోసం 100 గ్రాముల అల్లం తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి నీటిని పోయకుండా మెత్తని పేస్ట్ గా చేయాలి. 100 గ్రాముల అల్లం తీసుకుంటే 400 గ్రాముల బెల్లం తీసుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి బెల్లం, ఒక కప్పు నీటిని పోసి తీగ పాకం వచ్చాక అల్లం పేస్ట్ వేసి పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి.
బాగా పాకం వచ్చాక నెయ్యి రాసిన పళ్ళెంలో ఈ మిశ్రమాన్ని వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక ముక్క తింటే జలుబు,దగ్గు,పైత్యం,వికారం,గ్యాస్ అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. పరగడుపున తింటే నాలుగు రెట్లు అధికంగా పనిచేస్తుంది. అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. ఆకలి లేనివారిలో ఆకలి పుట్టేలా చేస్తుంది. ఈసీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించటానికి అల్లం మురబ్బా చాలా బాగా సహాయపడుతుంది. చాలా మంది అల్లం మురబ్బాను పంచదారతో చేస్తారు. పంచదారకు బదులుగా బెల్లం వాడితే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.
అల్లం,బెల్లంలలో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో తరచుగా జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీనిని చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు. అల్లం మురబ్బా దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో మీరు అల్లం మురబ్బా తీసుకొని మంచి ఆరోగ్యాన్ని పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.