Devotional

Lord Siva:శివుని కంఠం నీలి రంగులో ఉండడానికి కారణం ఇదే

Lord Shiva : ఒకప్పుడు పౌరాణిక సినిమాలు ఎక్కువగా వచ్చేవి. అందుచేత ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అలాంటి సినిమాలు రావడంలేదు. పైగా రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. అయితే ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. ఇక శివుడికి మూడు కన్ను ఉండడం వలన ముక్కంటి అని అంటారు.

అయితే శివుడికి కంఠం నీలి రంగులో ఉంటుంది. దీనికి పురాణం ప్రాశస్త్యం ఉంది. ఒకప్పుడు దేవతలకు, రాక్షసులకు మధ్య తరచూ గొడవలు అయ్యేవి. ఇక క్షీర సాగరాన్ని చిలకడం ద్వారా వచ్చే అమృతం కోసం ఇద్దరూ పోటీ పడతారు. చిలికే సమయంలో వచ్చే విషాన్ని శివుడు స్వీకరిస్తాడు.

దేవతలు, రాక్షసులు వేడుకోవడంతో పరమ శివుడు తన కంఠంలో విషం దాచుకుంటాడు. అందుకే గరళ కంఠుడు, నీలకంఠేశ్వర అని అంటారు. కాగా పాల సముద్రాన్ని చిలికే సమయంలో మొదటగా వచ్చిన కామ ధేనువుని వసిష్ఠ మహర్షికి ఇస్తారు. కల్ప వృక్షాన్ని దేవేంద్రుడికి ఇస్తారు.