White Hair:వారంలో 2 సార్లు ఇలా చేస్తే జీవితంలో తెల్లజుట్టు సమస్య అనేది ఉండదు.. ఇది నిజం
White Hair Home Remedies In telugu: ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్య వస్తుంది. తెల్లజుట్టు సమస్య రాగానే చాలా మంది కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ వాడేస్తూ ఉంటారు. వాటి కారణంగా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకున్న చిట్కా ఫాలో అయితే తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడటమే కాకుండా జుట్టు రాలే సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.
ఇప్పుడు చెప్పే రెమిడి ఫాలో అయితే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఒక ఉల్లిపాయ తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి. ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి.
ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు వేసి అరకప్పు నీటిని పోసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేయాలి. ఈ జ్యూస్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ జ్యూస్ ని ఒక స్ప్రే బాటిల్లో నింపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి.
ఒక గంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు సమస్య, జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు. ఈ విధంగా చేయటం వలన తెల్ల జుట్టు రావటం కూడా చాలా ఆలస్యం అవుతుంది.
కరివేపాకు,అల్లం,ఉల్లిపాయ, కొబ్బతి నూనెలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్ళకు బలాన్ని అందిస్తాయి. అలాగే జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పని చేస్తాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగానే లభ్యం అవుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.