Healthhealth tips in telugu

Garlic With Honey:పరగడుపున తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

Garlic With Honey benefits in Telugu : ఈ మధ్య కాలంలో వచ్చే సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటిలో సహజసిద్దంగా దొరికే పదార్ధాలను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించటానికి తేనె, వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రెండింటినీ విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి.

వెల్లుల్లి, తేనె రెండు మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అదే వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే ఊహించని ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. వెల్లుల్లి, తేనె మిశ్రమం ఎలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ఏ సమయంలో తీసుకుంటే మంచిదో చూద్దాం.

ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిది. అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున అసలు తీసుకోకూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయ్యిన అరగంట తర్వాత తీసుకోవచ్చు. వెల్లుల్లి, తేనె రెండూ పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. దీని వల్ల మన శరీరం ఎలాంటి వ్యాధినైనా తట్టుకోగలిగే విధంగా రూపు దిద్దుకుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది.

ప్రధానంగా బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు. వెల్లుల్లి, తేనె మిశ్రమం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది.పేరుకుపోయే కొవ్వును కూడా తొలగిస్తుంది. దీంతో వివిధ రకాల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉన్నాయి. దీంతో ఇది శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది.

జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి.డయేరియా, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు.పెద్ద పేగులో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు. జలుబు, ఫ్లూ జ్వరం, సైనస్ వంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి. దెబ్బలు, కాలిన గాయాలు, పుండ్లు వంటివి వెంటనే తగ్గిపోతాయి.శ్వాస కోశ సమస్యలతో బాధ పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది.

తయారీవిధానం:-
ఓ చిన్నపాటి జార్‌ను తీసుకుని అందులో సగం వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను నింపాలి.తరువాత ఆ వెల్లుల్లి రెబ్బలు మునిగిపోయే వరకు తేనె పోయాలి. ఆ తరువాత జార్‌కు మూత పెట్టి పొడి వాతావరణంలో 2 వారాల పాటు అలాగే ఉంచాలి. రెండు రోజులకు ఒకసారి జార్ మూత తీసి అందులోని మిశ్రమాన్ని కలపాలి.

2 వారాల అనంతరం ఆ మిశ్రమాన్ని వాడుకోవాలి. ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తినాలి. ఇలా తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలు వారం రోజులకే పొందుతారు. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి తీసుకుంటే ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు. కాబట్టి వెల్లుల్లి,తేనె మిశ్రమాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.