Healthhealth tips in telugu

Weight Loss Tips:7 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,తొడలచుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

Dates and Ginger Weight Loss Tips :ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువ అయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు.

అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే కచ్చితంగా అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఈ డ్రింక్ తాగడం వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. కాస్త ఓపికగా ఈ డ్రింక్ తయారుచేసుకొని తాగితే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

ముందుగా 2 లేదా 3 ఖర్జూరాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టి దానిలో ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడెక్కకా ఖర్జూరం,అల్లం ముక్కలను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.

ఈ నీటిని వడకట్టి దానిలో ఒక స్పూన్ నిమ్మరసం, చిన్న స్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా కలిపి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తూ ఉంటే చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అల్లంలో ఉన్న పోషకాలు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది.

ఈ డ్రింక్ లో తీసుకున్న అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు బరువు తగ్గించటానికి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నిమ్మలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. ఈ ఇంగ్రిడియన్స్ అన్నీ మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.