Healthhealth tips in telugu

Hing With Ghee:ఇంగువ నెయ్యి కలిపి తీసుకుంటే…ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలకు..

Hing With Ghee Benefits In Telugu : ఇంగువ మరియు నెయ్యి కలిపి తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇంగువ మరియు నెయ్యిలో అనేక పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంగువ మరియు నెయ్యిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికి రెండింటిని కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి.

నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ కె, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. మరోవైపు, ఇంగువలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, రైబోఫ్లావిన్ మరియు కార్బోహైడ్రేట్లు సమృద్దిగా ఉంటాయి. ఇంగువ మరియు నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇంగువ మరియు నెయ్యిలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన పొత్తి కడుపు తిమ్మిరి మరియు అజీర్ణం, గ్యాస్, నొప్పి నుండి ఉపశమనం కలిగించటానికి సహాయ పడుతుంది. ఇంగువ మరియు నెయ్యిలో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు గుల్లగా మారకుండా దృఢంగా మరియు బలంగా ఉండేలా చేసి వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు రాకుండా చేస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో ఎముకల మధ్య రాపిడి కూడా తగ్గుతుంది. విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన మెదడులోని రక్తనాళాలను శాంతపరచి తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.

పిల్లల్లో వచ్చే నులి పురుగుల సమస్యను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇంగువ,నెయ్యి మిశ్రమంలో తేనె కలిపి తీసుకుంటే గొంతునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ సీజన్ లో వచ్చే శ్వాస సంబంద సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. అరస్పూన్ నెయ్యిలో చిటికెడు ఇంగువ కలిపి తీసుకోవచ్చు…లేదంటే ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.