Beauty Tips

Hair Care Tips:వారంలో 2 సార్లు జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది

Curd Hair Growth Home Remedies In Telugu : వాతావరణంలో వచ్చే మార్పులు,పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, సరైన జుట్టు సంరక్షణ లేకపోవడం, రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూ, నూనెలు వాడటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయింది. .

జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి ఇంటిలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అయితే కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఒక చిన్న క్యారెట్ ని తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి తురమాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీరు వేడి అయ్యాక తురిమిన క్యారెట్ వేసి మెత్తగా ఉడికించాలి.
Eating bananas during monsoon is good or bad
ఆ తర్వాత బ్లెండర్ తీసుకొని అరకప్పు అరటిపండు ముక్కలు, ఉడికించిన క్యారెట్ తురు,ము రెండు స్పూన్ల పెరుగు వేసి మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిసే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు
పట్టించి గంటయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.
weight loss tips in telugu
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గిపోతుంది. క్యారెట్‌లోని పోషకాలు తల మీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అంతేకాక జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. క్యారెట్ లో ఉండే విటమిన్ A జుట్టు రాలకుండా చేస్తుంది. కండిషన్ చేస్తుంది.

జుట్టు సంరక్షణలో ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. క్యారెట్,పెరుగు,అరటి పండు, ఆలివ్ ఆయిల్ లోని పోషకాలు జుట్టు సంరక్షణలో సహాయపడి చుండ్రు,జుట్టు రాలే సమస్యను తగ్గించటంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి సహజసిద్దమైన పదార్ధాలను ఉపయోగించి జుట్టు సమస్యల నుండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.