Coriander Leaves:ఈ లాభాలు తెలిస్తే అసలు కొత్తిమీరను వదలరు….ఎందుకో తెలుసా?
kottimeera Health Benefits in telugu :మనం ప్రతి రోజు కూరల్లో కొత్తిమీరను వాడుతూ ఉంటాం. వంటల్లో కొత్తిమీరను వేయటం వలన వంటకు మంచి రుచి వస్తుంది. వంటకు రుచి రావటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కొత్తిమీరలో ఉన్నాయి. కొత్తిమీరలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు,పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచటానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచటానికి సహాయపడుతుంది.
ఒక గ్లాస్లో నీరు, మజ్జిగను సమభాగాల్లో కలిపి అందులో ఒక స్పూన్ కొత్తిమీర రసం, చిటికెడు జీలకర్ర కలిపి మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్స్,పోషకాలు లభిస్తాయి.
విటమిన్ ఎ, బి1, బి2, సి, ఐరన్ వంటివి సమృద్ధిగా అందుతాయి. ఇవి శరీర నిర్మాణానికి, ఎముకల దృఢత్వానికి, చర్మ సంరక్షణకు సహాయపడతాయి.
కొత్తిమీర రసంలో జీలకర్ర, నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్య నుండి బయట పడవచ్చు.
గర్భిణీ స్త్రీలు రెండు స్పూన్ల కొత్తిమీర రసాన్ని నిమ్మ రసంతో కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.
కొత్తిమీరను పెరుగులో కలిపి తరచూ తీసుకుంటే కడుపులో మంట తగ్గిపోతుంది.
కొత్తిమీర ఆకులను నమిలి మింగితే చిగుళ్ల సమస్యలు,నోటి దుర్వాసన తగ్గిపోతాయి.
కొత్తిమీరకు కొలెస్ట్రాల్‌ను తగ్గించే లక్షణం ఉండుట వలన ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు తగ్గటంలో సహాయపడుతుంది.