Beauty Tips

white hair:2 సార్లు రాస్తే చాలు జీవితంలో తెల్లజుట్టు సమస్య అనేది ఉండదు

White Hair Turn Black:మారిన జీవనశైలి, కొన్ని రకాల కారణాలతో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వస్తుంది. ఈ సమస్య రాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. ఇలా వాడటం వలన కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కా కోసం ఉసిరికాయను ఉపయోగిస్తున్నాం. ఉసిరికాయలో ఉన్న పోషకాలు జుట్టు కుడుళ్ళను బలోపేతం చేసి జుట్టు రాలకుండా కాపాడుతుంది.

అలాగే మెలనిన్ స్థాయిలను పెంచుతుంది. మెలనిన్ స్థాయిలు తగ్గితే జుట్టు తెల్లగా మారుతుంది.ఈ చిట్కా కోసం 10 నుంచి 15 ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేయాలి.

పొయ్యి వెలిగించి ఇనుప మూకుడు పెట్టి ఉసిరి పొడిని వేసి మూడు నుంచి ఐదు నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత అందులో కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పది నిమిషాల పాటు కొబ్బరి నూనెలో ఉసిరి పొడిని ఉడికించాలి.

ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ నూనెను వడగట్టి ఒక సీసాలో నిలువ చేయాలి. ఆ తర్వాత ఈ నూనె సీసాను మూత పెట్టి దాదాపుగా 15 రోజులపాటు ఎండలో ఉంచాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత కుంకుడు కాయలు లేదా హెర్బల్ షాంపుతో తల స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది. ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.