Hair Pack : ఈ హెయిర్ ప్యాక్‌తో జుట్టు బలంగా పెరుగుతుందట..
1. ఒక బౌల్ లో ఒక టేబుల్ స్పూన్ అవొకాడో గుజ్జు, టీ స్పూన్ తేనె, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి అయిదు నిమిషాల పాటు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ బ్రష్ సహాయంతో తలకు పట్టించి అరగంట తరవాత షాంపూతో తల స్నానం చేయాలి. డ్రై హెయిర్ గల వారు 15 రోజులకి ఒకసారి ఈ మాస్క్ వేసుకుంటే నిర్జీవమైన జుట్టు నిగనిగలాడుతుంది.
2. హెన్నా మిశ్రమంలో మందార ఆకులను పేస్ట్ చేసి కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
3. ఒక కప్పు పెరుగులో రెండు కోడిగుడ్ల సొనను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి గంటన్నర తరవాత షాంపూతో తలస్నానం చేయాలి. పది రోజులకి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే నిగనిగలాడే జుట్టు మీకు సొంతం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.