Drumstick :ఆరోగ్యానికి మంచిదని మునక్కాయను ఓవర్‌గా తింటే..రిస్క్‌లో పడ్డట్టే!
Drumstick Health Benefits in telugu : ప్రతిరోజూ మునక్కాయను తీసుకోవడం ద్వారా శరీరానికి పుష్కలంగా శక్తి లభిస్తుంది. విటమిన్ ఎ, సి ఇందులో ఉన్నాయి. కెలోరీలు 26, ఫైబర్ 4.8 గ్రాములు, ఫాట్ 0.1, క్యాల్షియం30 మి.గ్రాములు, మెగ్నీషియం 24 మి. గ్రాములు ఉంటాయి.
పిల్లలకు మునక్కాయ చాలా మంచిది. పిల్లలు మునక్కాయ తీసుకుంటే కడుపులోని క్రిములు వెలికివస్తాయి. దగ్గు, రక్తహీనత, నులిపురుగులకు నిరోధించవచ్చు. అయితే వృద్ధులు, హృద్రోగ సమస్యలు, మోకాలి వ్యాధులున్నవారు మునక్కాయ తీసుకోకూడదు.
ఇంకా మునక్కాడలతో నరాలకు మేలు చేకూరుతుంది. మునక్కాయను వారంలో రెండుసార్లు తీసుకుంటే కడుపునొప్పి నయమవుతుంది. కిడ్నీ సమస్యలు దూరమవుతాయి. గర్భిణీలు మునక్కాయను తీసుకుంటే ప్రసవానికి ముందు తర్వాత ఏర్పడే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. ప్రసవానికి తర్వాత మునక్కాయ తినడం ద్వారా పాలు పడతాయి. జలుబును దూరం చేసుకోవచ్చు.
ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని చక్కెర పరిమాణాన్ని బాగా తగ్గిస్తుంది.దాంతో హైపోక్సేమియాకు గురి కావాల్సి వస్తుంది. ఫైబర్ అత్యధికంగా ఉంటుంది.శరీరానికి ఫైబర్ అవసరమే.కానీ, అతిగా తీసుకోవడం చాలా ప్రమాదం.శరీరంలో ఫైబర్ శాతం ఎక్కువైతే.మలబద్ధకం, అతిసారం, పేగు సమస్యలు వంటివి ఏర్పడతాయి.
గర్భిణీలు ఎక్కువగా మునక్కాయలు తీసుకుంటే శరీర వేడి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అంతేకాదు, ఒక్కోసారి గర్భస్రావానికి కూడా దారి తీస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.