షుగర్ ఉన్నవారు ఈ పండ్లను తింటే…ఏమి అవుతుందో తెలుసా?
Best fruits for diabetes In telugu :ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా చిన్న వయస్సులోనే డయబెటిస్ సమస్య వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు కంగారూ పడకుండా డాక్టర్ సూచనలను పాటిస్తూ మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే పండ్లను కూడా తినవచ్చు. అయితే మితంగా మాత్రమే తినాలి.
కివి పండు : ఈ పండులో అనేక పోషకాలు ఉండటమే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ 47 నుంచి 58 వరకు ఉంటుంది. ఫైబర్ ఎక్కువగాను కార్బోహైడ్రేడ్స్ తక్కువగాను ఉంటుంది. కివి పండు రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించటమే కాకుండా కొలస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గేలా చేస్తుంది.
ఈ పండులో మినరల్స్,విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ A,విటమిన్ C, విటమిన్ E.ఫైబర్ ,పొటాషియం,ఫోలేట్ , బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తాయి. కివి పండులో ఇనోసెటల్ అనే ఎంజైమ్ మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది.
బ్లాక్ జామున్(నేరేడు పండ్లు): ప్రతి రోజు నేరేడు పండ్లను తింటే రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. నెరెదు పండ్లలో పీచు ఎక్కువగా ఉండుట వలన మధుమేహ వ్యాది గ్రస్తులు తినవచ్చు.
స్టార్ ఫ్రూట్: నేరేడు పండ్లులాగే ఉండే ఈ స్టార్ ఫ్రూట్ మధుమేహ గ్రస్తులకు చాలా మంచిది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఈ ఫ్రూట్స్ తినడంతో పాటు మధుమేహ గ్రస్తులు కొంచెం వ్యాయామం చేయాల్సి ఉంటుంది.
జామకాయ(గోవా): జామకాయలో అధికశాతంలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి, ఫైబర్ ఉండటం వల్ల జామకాయ మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మరియు మలబద్దకానికి మంచిది.
చెర్రీ: చెర్రీస్ లో GL (glycemic index) 20 ఉంటుంది. మధుమేహగ్రస్తులకు చెర్రీస్ ను ఓ మంచి స్నాక్ అని చెపవచ్చు. వీటిని రోజులో ఎప్పుడైపనా తినవచ్చు.
పీచెస్: ఈ ఫ్రూట్ చాలా మంచి టేస్ట్ కలిగి ఉంటుంది. అలాగే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇందులో GL తక్కువగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు చాలా మంచిది.
బెర్రీస్: బెర్రీస్ లో చాలా రకాలు ఉన్నాయి, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్పెబెర్రీ, క్రాన్ బెర్రీ, చోక్ బెర్రీ.. వీటిలో యాంటిఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులు నిరభ్యంతరంగా తినవచ్చు.
ఆపిల్స్: ఆపిల్స్ లో కూడా అధిక శాతంలో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. జీర్ణవ్యవస్థకు బాగా సహాయపడుతుంది. శరీరంలో అన్ని జీవక్రియలు క్రమంగా పనిచేసేలా చేస్తాయి.
పైనాపిల్: పైనాపిల్ డైయాబెటిక్ పేషంట్స్ కు చాలా మంచిది. పైనాపిల్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫమేటరీగాను మరియు క్రిమినాశనకారిగాను పనిచేసే లక్షణాలు సమృద్ధిగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు చాలా మంచిది.
ఫిగ్(అంజూర): అంజూర పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇన్సులిన్ ఫంక్షన్ కంట్రోల్ చేస్తుంది.
ఆరెంజ్: సిట్రస్ జాతికి చెందిన ఈ పండ్లలో విటమిన్ సి మరియు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండ్లను ప్రతి రోజూ తినవచ్చు.
వాటర్ మెలోల్(పుచ్చకాయ): పుచ్చకాలో GL విలువలు తక్కువగా ఉండి మధుమేహగ్రస్తులు తినేందుకు ఉపయోగపడుతాయి. శరీరానికి కావల్సిన నీటి శాతాన్ని అంధిస్తుంది.
ఉసిరి కాయ: ఈ కాయల్లో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఉసిరికాయలు మధుమేహగ్రస్తులకు చాలా ఆరోగ్యకరం.
వైట్ జామూన్(తెల్ల నేరేడు పండ్లు): ఇవికూడా నేరేడు పండ్ల జాతివే. తెల్లనేరేడు పండ్లలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే శక్తి అందిస్తుంది. కాబట్టి వీటిని కూడా రోజూ తినవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.