Healthhealth tips in telugu

Health Tips:కూర్చున్నప్పుడు కాలి మీద కాలు వేసుకుంటున్నారా…రిస్క్ లో పడినట్టే

Avoid sitting with your legs crossed :పెద్దల ముందు కాలిమీద కాలు వేసుకుని కూర్చోవద్దని, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవద్దంటూ ముఖ్యంగా లేడీస్‌ కాలిమీద కాలు వేసుకోని కూర్చోవడంను మన పెద్దలు తప్పుబడుతూ ఉంటారు.ఇప్పటికి కూడా చాలా మంది ముసలి వారు ఎవరైనా ఆడవారు కాలిమీద కాలు వేసుకుని కూర్చుంటే ఊరుకోరు.

మగవారి విషయంలో మనవద్ద ఎలాంటి పట్టింపు అయితే లేదు.పెద్దల ముందు చిన్న వారు కూర్చోకూడదని అంటారు.అయితే అసలు కాలిమీద కాలు వేసుకోని కూర్చోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయంటూ అమెరికా వైధ్యులు నిర్థారించారు.

అమెరికాకు చెందిన ఒక ప్రముఖ యూనివర్శిటీలో జరిగిన సుదీర్ఘ పరిశోదనల ఫలితంగా చెబుతున్న దాని ప్రకారం కాలిమీద కాలు వేసుకోవడం అనేది చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది.రోజుల్లో ఎక్కువ సమయం, ప్రతి రోజు కూడా ఎక్కువ సమయం కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయంటూ తాజాగా ఒక ప్రయోగం ద్వారా అమెరికన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముఖ్యంగా అమ్మాయిలు టైట్‌ డ్రస్‌లు వేసుకుని ఎక్కువగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఎముకల నొప్పులు లేదా మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.2010 సంవత్సరం నుండి పలువురు మోకాళ్ల నొప్పుల రోగులను పరిశీలించిన తర్వాత డాక్టర్లు ఈ విషయాన్ని చెబుతున్నారు.నడుము కింది భాగము మరియు రెండు కాళ్లను కలుపుతూ పెల్విన్‌ అనే పెద్ద ఎముక ఉంటుంది.

దానిపై కాలిమీద కాలు వేసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది.అందుకే ఆ సమయంలో పెల్విన్‌పై ప్రభావం పడుతుంది.దాంతో కాలిమీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది మంచిది కాదని వైధ్యులు అంటున్నారు.ఎక్కువ సమయం కాలిమీద కాలు వేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి అంటూ మన పెద్దలకు తెలియకున్నా ఇన్నాళ్లు కాళ్ల మీద కాలు వేసుకోవడం మంచిది కాదని చెప్పారంటూ వారు ఎంత గ్రేటో కదా.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.