Carom Seeds:1 spoon తో మీ పొట్ట పూర్తిగా శుభ్రం అవుతుంది… గ్యాస్,ఎసిడిటీ,మలబద్దకం జీవితంలో ఉండదు
Best Home remedies for gastric problem : నూనెలో వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినటం, ఎక్కువగా కారాలు తినటం వంటి కారణాలతో గ్యాస్ సమస్య అనేది వస్తుంది. గ్యాస్ సమస్య తగ్గించుకోవటానికి మందులు ఉన్న ఇంటి చిట్కాలతో కూడా తగ్గించుకోవచ్చు. గ్యాస్ సమస్య ప్రారంభదశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు కడుపు నొప్పి కూడా వస్తుంది.
ఈ చిట్కా కోసం వాము ని ఉపయోగిస్తున్నాం. ఆయుర్వేదంలో వాము ఎక్కువగా వాడతారు. వాములో ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఆరస్పూన్ వాములో చిటికెడు రాక్ సాల్ట్ వేసి బాగా దంచి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని వచ్చే రసాన్ని మింగాలి. ఇది కొంచెం వగరుగా, చేదుగా ఉంటుంది. ఈ రసం మింగటం వలన గ్యాస్, కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.వాము మిశ్రమం వేసుకున్నాక ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి.
ఇలా తాగడం వల్ల గ్యాస్ బయటికి పోయి కడుపునొప్పి తగ్గుతుంది.వాము అనేది పురాతన కాలం నుండి అజీర్ణ సమస్యలకు వాడుతున్నారు. రాక్స్ సాల్ట్ అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రేగు కదలికలు ప్రోత్సహిస్తుంది. ప్రేగుల నుండి విషపదార్థాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఆకలిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.