Yellow teeth:ఇలా చేస్తే 5 నిమిషాల్లో పళ్ళ పై ఉన్న గార, పసుపు పోయి తెల్లగా మెరుస్తాయి
Yellow teeth turn white tips In Telugu : సాదారణంగా దంతాలు తెల్లగా మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పళ్ళు పచ్చగా, గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది దంతాలకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి.
దంతాలు తెల్లబడటానికి మార్కెట్లో అనేక విధానాలు మరియు ఖరీదైన దంత చికిత్సలు ఉన్నాయి. అయితే ఖరీదైన చికిత్సలతో పనిలేకుండా, మన ఇంటిలో అందుబాటులో ఉండే వస్తువులతో సహజసిద్దంగా దంతాలను తెల్లగా మెరిసేలా చేయవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
దీని కోసం ఒక బౌల్ లో అరస్పూన్ బేకింగ్ సోడా, కొంచెం తెల్లని టూత్ పేస్ట్, 2 స్పూన్ల నల్లని కూల్ డ్రింక్ వేసి బాగా కలిపి బ్రష్ సాయంతో పళ్లను శుభ్రం చేయాలి. ఈ విధంగా ఉదయం, సాయంత్రం చేస్తూ ఉంటే దంతాల మీద గార, పసుపు రంగు తొలగిపోయి పళ్ళు తెల్లగా ముత్యాల్లా మెరుస్తాయి.
బేకింగ్ సోడా పళ్లపై ఉన్న గారను తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ చిట్కాను రెండు రోజులు చేస్తే తేడా గమనించి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. చాలా తక్కువ ఖర్చుతో తెల్లని మెరిసే దంతాలను సొంతం చేసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.