Bellam Ravva Laddu : బెల్లంతో చేసిన రవ్వ లడ్డూలను ఎప్పుడైనా తిన్నారా..సూపర్ టేస్టీగా ఉంటాయి!
Bellam Ravva Laddu Recipe: బొంబాయి రవ్వతో సాధారణంగా మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం. స్వీట్ విషయానికొస్తే బొంబాయి రవ్వతో హల్వా చేస్తూ ఉంటాం. అలా కాకుండా బెల్లంతో కలిపి రవ్వ లడ్డు చేస్తే చాలా బాగుంటుంది. చాలా మంది రవ్వ లడ్డు అంటే పంచదారతో చేసుకుంటూ ఉంటారు. అయితే బెల్లంతో చేసుకోకుంటే చాలా రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి.
కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ ఒక కప్పు, ఎండుకొబ్బరి పావు కప్పు, బెల్లం తురుము ఒక కప్పు, నెయ్యి రెండు స్పూన్లు, నచ్చిన డ్రై ఫ్రూట్స్, యాలకులు నాలుగు
తయారీ విధానం
పొయ్యి మీద మూకుడు పెట్టి నాలుగు స్పూన్ల నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత పావు కప్పు ఎండు కొబ్బరి వేసి వేయించాలి.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు బెల్లం తురుము వేసి పావు కప్పు నీళ్లు పోసి కలుపుతూ బెల్లం పూర్తిగా కరగాలి. ఇలా కరిగిన తర్వాత గిన్నెను పక్కనపెట్టి ఇదే స్టవ్ పైన మూకుడు పెట్టి దీనిలోకి బెల్లం నీటిని వడకట్టాలి. బెల్లం పాకం కాస్త జీడి పాకం వచ్చేదాకా కలపాలి. ఆ తర్వాత ఏలకుల పొడి ఆ తర్వాత వేగించి పెట్టుకున్న రవ్వ, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి.
మనం వేసిన అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించాలి. కాస్త చల్లారక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలను చుట్టుకోవాలి. బెల్లంతో తయారు చేసిన ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. రోజుకి ఒక లడ్డు తినవచ్చు.
Click Here To Follow Chaipakodi On Google News