Kitchenvantalu

Rayalaseema Special Chitlam Podi:రాయలసీమ స్పెషల్ పొడి ఉంటె ఏ చట్నీలు అవసరం లేదు.. సూపర్ రుచి

Rayalaseema Special Chitlam Podi Recipe: శనగపప్పు,కందిప్పులకు కాసిన్ని మిరియాలు జోడించి ఎండుమిర్చి ఘూటు తగిలించి పొడి చేసి పెట్టుకున్నారంటే ఇడ్లీ, దోస, వడ లాంటి టిఫిన్స్ లోకి చట్నీతో పనేఉండదు. మరీ చిట్లం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మినపప్పు- ¼ కప్పు
పచ్చి శనగపప్పు- ¼ కప్పు
కంది పప్పు – ¼ కప్పు
చింతపండు- ఉసిరికాయంత
ఎండుమిర్చి – 20-30
మిరియాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
వెల్లుల్లి – ఆప్షనల్
ఇంగువ,బెల్లం- ఆప్షనల్

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని మూడు పప్పులకు సన్నని సెగపై దోరగా వేయించి చల్లారినివ్వాలి.
2.అదే ప్యాన్ లో మిరపకాయలను కూడ వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
3.తర్వాత జీలకర్ర,మిరియాలు కూడ వేపుకోని పప్పులలో కలుపుకోవాలి.
4.చింతపండును కూడ కాసేపు వేడి పెనం పై వేపి తీసుకోవాలి.

5.ముందు మిక్సిజార్ లో చల్లారిని మిర్చి,ఉప్పు,చింతపండు వేసి మిర్చీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
6.అందులోకి చల్లారిని పప్పుల్ని,మిరియాలని కూడా వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
7.నచ్చితే అందులోకి వెల్లుల్లి కూడ వేసుకోని గ్రైండ్ చేసుకోవొచ్చు.
8.గ్రైండ్ చేసుకున్న పొడిని ఎయిర్ టైట్ కంటేనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు నెలల వరకూ ఫ్రెష్ గా ఉంటుంది.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."