Kakarakaya karam:కాకరకాయ కారం పొడి ఒక్క సారి ఇలా చేస్తే చేదు లేకుండా కమ్మగా రోజు తినేయచ్చు
Andhra Style Kakarakaya karam Recipe: రుచికి చేదైనా శరీరానికి ఎంతో మంచిది కాకరకాయ. కాకరకాయ పొడి చేసుకుని పెట్టుకున్నారంటే, నెల రోజుల వరకు, వేడి వేడి అన్నంలో, రెండు ముద్దలు తిన్నారంటే, నోటికి తృప్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
కావాల్సిన పదార్ధాలు
కాకరకాయలు – 300 గ్రాములు
పచ్చిశనగరప్పు – 2 టేబుల్ స్పూన్స్
మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి – 8 రెబ్బలు
చింతపండు – ఉసిరికాయంత
ఎండుమిర్చి – 10-15
బెల్లం – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – 1/3కప్పు
తయారీ విధానం
1.కాకరకాయను కొబ్బరిలా తురుముకుని, ఉప్పు వేసి, 30 నిముషాలు పక్కన పెట్టాలి.
2. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి అందులోకి, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, వేసుకుని, మంచి వాసన వచ్చేవరకు వేపుకోవాలి.
3. పప్పులు వేగిన తర్వాత అందులోకి, వెల్లుల్లి, చింతపండు, వేసి, చల్లార్చుకోవాలి.
4. ఇప్పుడు అదే పాన్ లోకి నూనె వేడి చేసుకుని, ఎండుమిర్చి ఎర్రగా వేపుకోవాలి.
5. పక్కన పెట్టుకున్న కాకరకాయ తురుమును, గట్టిగా పిండుకుని, రసం తీసి వేయాలి.
6. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని, కొద్దిగా నూనె వేసి, కాకరకాయ ముద్ద వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు, మీడియం ఫ్లేమ్ పై కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని, కాకరకాయ పొడిని చల్లారనివ్వాలి.
8. ఒక మిక్సీజార్లోకి వేయించిపెట్టుకున్న పప్పులు, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, బెల్లం, వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
9. ఇప్పుడు వేపుకున్న కాకరకాయ పొడిని వేసి మరో రెండు మార్లు మిక్సీ తిప్పుకోవాలి.
10. ఎయిర్ టైట్ కంటైనర్ లో కాకరపొడిని స్టోర్ చేసుకుంటే, నెలరోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది.
Click Here To Follow Chaipakodi On Google News