Kitchenvantalu

Fake Cashew Identify : నకిలీ జీడిపప్పు గుర్తించడం ఎలా? ఈ చిట్కాలు మీకోసమే..

Fake Cashew Identify : ఈ మధ్యకాలంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి మనలో చాలామంది డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. దాంతో డ్రై ఫ్రూట్స్ లలో కూడా నకిలీ వచ్చేసాయి. ఇక ఇప్పుడు జీడిపప్పులో నకిలీ జీడిపప్పును ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

జీడిపప్పు రంగు కాస్త పసుపు రంగులో ఉంటే అది నకిలీది అని గుర్తించాలి. జీడిపప్పు తెల్లగా ఉంటే అది స్వచ్ఛమైనది అని అర్థం చేసుకోవాలి. జీడిపప్పు మీద మచ్చలు, నలుపు అలాగే రంధ్రాలు ఉంటే కొనుగోలు చేయకూడదు.

స్వచ్ఛమైన జీడిపప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నాణ్యత తక్కువ ఉన్న జీడిపప్పు తొందరగా పాడైపోతుంది. నకిలీ జీడిపప్పు తింటుంటే పిండి నమిలిన భావన కలుగుతుంది.

అలాగే జీడిపప్పు తింటున్నప్పుడు పళ్లకు అంటుకుంటే అది నకిలీ జీడిపప్పుగా అర్థం చేసుకోవాలి. జీడిపప్పును తిన్న తర్వాత దంతాలకు అంటుకోకుండా ఉంటే అది స్వచ్ఛమైన జీడిపప్పు అని భావించాలి. అలాగే మంచి వాసన వస్తే అది నిజమైన జీడిపప్పు.. అదే జిడ్డు వాసన వస్తూ ఉంటే అది నకిలీ జీడిపప్పుగా భావించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.